టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్నాయనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారని ఆయన తెలిపారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఇలా రెండు రకాలు ఉన్నాయని విజయ్ తెలిపారు. నేను ఈ ఏ23 అనే గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చానని ఆయన తెలిపారు.

బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ కు సంబంధం లేదని విజయ్ దేవరకొండ అన్నారు. చాలా రాష్ట్రాలలో గేమింగ్ యాప్స్ లీగల్ అని ఆయన చెప్పుకొచ్చారు. గేమింగ్ యాప్స్ కు అనుమతులు,  రిజిస్ట్రేషన్, టాక్స్, జీఎస్టీ ఉంటాయని  నా బ్యాంక్ లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించానని  విజయ్ దేవరకొండ తెలిపారు. నేను ప్రమోట్ చేసిన యాప్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెన్ కాదని ఆయన కామెంట్లు  చేశారు.

నేను లీగల్ గేమింగ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని  సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం  వివరాలు ఈడీకి వెల్లడించానని ఆయన అన్నారు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్  సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. కింగ్ డమ్  మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్  ప్రస్తుతం 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.  విజయ్ దేవరకొండ రేంజ్ అంతకంతకూ  పెరుగుతోంది. తర్వాత సినిమాలతో విజయ్  ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తూందేమో  చూడాల్సి ఉంది.  విజయ్ దేవరకొండ ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: