
ఇక ఆ తర్వాత వరుసగా ‘విశ్వాత్మ’, ‘మోహ్రా’, ‘గుప్త్’ లాంటి మాస్ మసాలా హిట్లు అందించి టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పాటల ఎంపిక, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, భారీ టేకింగ్‌తో ఆయన స్టైల్‌కి యూత్ ఫిదా అయిపోయింది. మాఫియా బెదిరింపులు... కెరీర్‌ను చిత్తు చేసిన నెగటివ్ టర్నింగ్! .. ‘గుప్త్’ సక్సెస్ తర్వాత రాజీవ్ రాయ్ పై ముంబై మాఫియా కన్నేసింది. ఫోన్ కాల్స్, బెదిరింపులు మొదలయ్యాయి. రికార్డింగ్స్‌కి వచ్చేవాళ్లను బెదిరించడంతో పాటలు ఆగిపోయాయి. ఆఫీస్‌లపై దాడులు జరిగాయి. పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చినా భయం అంతగా తీరలేదు. దర్శకుడి ఫోకస్ పూర్తిగా తప్పిపోయింది. ఈ ప్రభావంతో 2001లో తీసిన ‘ప్యార్ ఇష్క్ మోహబ్బత్’ డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత తీసిన ‘అసంభవ్’ (2004) కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. వన్ టైమ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఇండస్ట్రీలో కొనసాగలేనంతగా మాఫియా భయంతో గులాబీ అయిపోయాడు. విదేశాలకి వెళ్లిపోయిన రాజీవ్ – రీ ఎంట్రీ ప్రయత్నాలు .. 2004 తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన రాజీవ్, తండ్రి (గుల్షన్ రాయ్)తో పాటు విదేశాలకు వెళ్లిపోయాడు. మాఫియా బెదిరింపులు, గుల్షన్ కుమార్ హత్యలు చూసిన తర్వాత ఇండియాకి మళ్ళీ రావాలనే ధైర్యమే తలెత్తలేదని చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియాకు వచ్చి రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. మాఫియా బెదిరింపుల వల్ల ఓ స్టార్ డైరెక్టర్ ఇండస్ట్రీకి దూరం కావాల్సి రావడం... సినిమాల కంటే పెద్ద ట్రాజెడీ!