
ఇవన్నీ పక్కనపడితే ఇప్పుడు వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడిన మాటలు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వార్ 2 ఫీవర్ పట్టుకుని ఉంది అని చెప్పాలి . మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పాపులారిటి సంపాదించుకున్న ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజా ప్రాజెక్ట్ "వార్ 2". ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు మూవీ మేకర్స్ .
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ గా హాజరైన సూర్యదేవర నాగ వంశీ స్టేజ్ పై మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయి . ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఇదివరకు చాలా ఈవెంట్లలో ఎంతో కాన్ఫిడెంట్గా తన సినిమా రిజల్ట్ కోసం మాట్లాడిన నాగవంశీ . ఈ సినిమా విషయంలో కూడా అదే తరహా స్టేట్మెంట్ అందించారు. " మామూలుగానే అందరూ నన్ను చాలా తిట్టుకుంటూ ఉంటారు . ఈ సినిమా చూసి నచ్చకపోతే అంతకు వందింతలు తిట్టుకోండి "అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు . దీనితో సినిమా అవుట్ ఫుట్ విషయంలో తాను ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు . సూర్యదేవర నాగవంశీ ఇంత క్లారిటీగా చెప్పారు అంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉండనే ఉంటుంది అంటూ జనాలు కూడా ఆయన స్టేట్మెంట్ ని లైక్ చేస్తున్నారు. కొంతమంది ఈ డేర్ ఏంటి రా బాబు .. బడా ప్రాజెక్ట్ పై ఇలాంటి స్టేట్మెంట్ అంటూ షాక్ అయిపోతున్నారు . ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు..!