
నెగిటివ్ షేడ్స్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఈ వార్ 2. ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . జనాలు కూడా ఈ సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ మరింత హైలెట్గా మారింది . స్టేజ్ పైకి వచ్చిన ఆయన మైక్ పట్టుకొని మాట్లాడటం ప్రారంభించాడు . ఇక అంతే ఫ్యాన్స్ అరుపులు కేకలతో రచ్చ రంబోలా చేసేశారు . జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్ తో ఈవెంట్ ని హైలైట్ గా మార్చేశాడు . అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఓవర్గం ప్రేక్షకులను తీవ్రంగా హర్ట్ చేస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ చాలా నిజాయితీగా సింపుల్ గా అందరూ అనుకునే విధంగా .." అభిమానుల అండ ఉన్నంతవరకు స్వర్గంలో ఉన్న తన తాత గారి ఆశీర్వాదాలు తనపై ఉన్నంతవరకు ..మా నాన్న చల్లని చూపు నా మీద ఉన్నంతవరకు ఎవ్వరూ ఏం చేయలేరు " అంటూ చాలా హుందాక గట్టిగా నొక్కి చెప్పారు . స్పీచ్ లో ఇదే హైలెట్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఒక బిగ్ బడా తెలుగు సీనియర్ హీరోని టార్గెట్ చేసి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు .
కొంతకాలంగా వాళ్ళ మధ్య ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ని ఆ హీరో ఫ్యాన్స్ ట్రోల్ కూడా చేశారు . ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ లో మాట్లాడిన మాటలు ఆ హీరో ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయి. ఆ హీరో పేరుని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ హీరో పేరుని ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురిఅయ్యేలా చేస్తున్నారు . అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్నింది ఆ హీరోనో కాదు మీకు ఎందుకు అంత బాధ అని కామెంట్స్ పెట్టే జనాలు కూడా ఉన్నారు . జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటల వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. "నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్న మాట " జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం మరింత హిట్ పెంచేసింది..!!