ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా, "నాగార్జున" పేరు చెబితే వచ్చే అరుపులు వేరే లెవెల్‌లో ఉంటాయి. సీనియర్ హీరో అయినప్పటికీ, ఇప్పటికీ తన స్టైల్‌లో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఆయన తన రూట్ మార్చుకొని విలన్ రోల్స్‌లో కూడా కనిపిస్తున్నారు. విలన్ పాత్రలో నటించినా కూడా అభిమానులు ఆయనను విపరీతంగా ఆరాధిస్తున్నారు. కుబేర సినిమాలో ఆయన పర్ ఫామెన్స్ కి ఎంత మంది ఫిదా అయ్యారో అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కూలీ సినిమాలో తొలిసారి ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ చేసి ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకున్నారు. ఈ సక్సెస్‌తో నాగార్జున ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు ఆయన వ్యక్తిగత ఆస్తులు, లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది.ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నాగార్జున ఆస్తుల విలువ 3500 కోట్లకు పైగా ఉంటుంది.


అన్నపూర్ణ స్టూడియోస్: ఆయన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి. దీని ఖరీదు రూ.200 కోట్లకు పైగా ఉంటుంది. దీనిని ఆయన తండ్రి దివంగత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి.

జూబ్లీహిల్స్ మెన్షన్: ప్రస్తుతం కుటుంబంతో నివసిస్తున్న ఇల్లు. దీని విలువ దాదాపు రూ.55 కోట్లు.

N Grill రెస్టారెంట్: నాగార్జున పర్యవేక్షణలో నడుస్తున్న ఈ రెస్టారెంట్ జూబ్లీహిల్స్‌లో ఉంది. గ్లోబల్ ఇండియన్ వంటకాలతో ఇది ప్రసిద్ధి చెందింది. స్టార్ సెలబ్రిటీస్ ఇక్కడ ఎక్కువగా వస్తారు.

లగ్జరీ కార్లు: 2024లో కొత్తగా Lexus LM MPV కారును తన కలెక్షన్‌లో చేర్చుకున్నారు. దీని ఖరీదు సుమారు రూ.2.5 కోట్లు.

ప్రైవేట్ జెట్: కేవలం కుటుంబం కోసం మాత్రమే వాడే ఈ జెట్ ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుంది.

మొత్తానికి సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోల లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు నాగార్జున. కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. అందుకే ఆయనకు అభిమానులు అంత ఇష్టం పెడతారు.
\

మరింత సమాచారం తెలుసుకోండి: