సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఆగస్టు 14న వచ్చిన చిత్రం కూలీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గానే విడుదలయ్యింది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితర నటీనటులు నటించిన ఈ చిత్రం విడుదలై రెండు రోజులు కావస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


కూలీ సినిమా విడుదల కాకముందే రికార్డు స్థాయిలో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .43 కోట్ల వరకు ఈ హక్కులను ఏషియన్ సురేష్ వారు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపించింది. తమిళ రైట్స్ రూ .100 కోట్లు.. నార్త్ ఇండియా రూ .50 కోట్లు, కేరళ, కర్ణాటక రూ .20 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ .85 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు వినిపించాయి మొత్తం మీద ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా రూ .310 కోట్లకు పైగా జరిగింది. కూలీ సినిమా మొదటి రోజే రూ .150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.


ముఖ్యంగా తమిళనాడులో రూ .40 కోట్లకు పైగా వచ్చాయని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి రెస్పాన్స్ లభించిందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇక రెండవ రోజు కూడా మంచిగానే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.సుమారుగా రూ .13 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో రాబట్టింది తమిళనాడులో రూ .34 కోట్లు హిందీలో 7 కోట్ల వరకు సాధించినట్లు సమాచారం. రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయానికి వస్తే రూ .88 కోట్లు రూపాయలు. ఇలా మొత్తం మీద రూ  243 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేరినట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి చిత్ర బృందం అఫీషియల్ గా ఎలాంటి పోస్టర్ తో ఈ విషయాన్ని తెలియజేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: