అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల చేసిన ప్రయోగాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోయినా, తన తదుపరి సినిమా ‘లెనిన్’ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మొదటి నుంచే అఖిల్ లుక్‌, స్టైల్‌, కథాంశం మీద మంచి హైప్‌ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరగుతున్న ఈ సినిమా గురించి ప్రతీ రోజు ఒక కొత్త రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందనే వార్త హాట్ టాపిక్ అయింది. వచ్చే షెడ్యూల్ లో ఈ పాటను చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. అదేవిధంగా ఈ పాటను పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ చేత పాడించబోతున్నారట‌.


సినిమా కథ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంతాన్ని బేస్‌గా తీసుకుని కథను రూపొందించారు. అందుకే అఖిల్ పాత్రలో మాట్లాడే యాస పూర్తిగా చిత్తూరు స్లాంగ్‌లోనే ఉండబోతోంద‌ట‌. ఈ మాడ్యులేషన్ కోసం అఖిల్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని, తన పాత్రకు న్యాయం చేయాలని చాలా కష్టపడుతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల కావడంతో ఈ జోడీపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ - శ్రీలీల కలయికలో వచ్చే లవ్ సీన్స్, పాటలు చాలా బాగుంటాయని యూనిట్ చెపుతోంది.


మేకర్స్ లెనిన్ సినిమా రిలీజ్ డేట్‌ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. అఖిల్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే తన కెరీర్‌లో మలుపు తిరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: