తాజాగా ఆగస్టు 14 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో రూపొందిన వార్ 2 , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నాగార్జున విలన్ పాత్రలో నటించిన కూలీ సినిమాలు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు మూవీ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ ఎత్తున విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ రెండు మూవీ లకు మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి లకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. విడుదల అయిన నాలుగవ రోజు ఈ రెండు సినిమాల కలెక్షన్లు కాస్త తగ్గాయి. కానీ ఈ రెండు మూవీ లకు విడుదల అయిన నాలుగవ రోజు కూడా డీసెంట్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. ఇక విడుదల అయిన నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఏ మూవీ నాలుగవ రోజు కలెక్షన్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పై చేయి సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం.

నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమాకు 3.57 కోట్ల కలెక్షన్లు దక్కగా ... కూలీ సినిమాకు 4.33 కోట్ల కనెక్షన్లు దక్కాయి. దీనితో నాలుగవ రోజు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా కంటే కూలీ సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి వార్ 2 మూవీ పై కూలీ సినిమా పై చేయి సాధించింది. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాలను సొంతం చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: