
2019లో గౌతమి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ధర్మ మహేష్. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్న తర్వాత మహేష్ ఎక్కువగా జల్సాలకు అలవాటు పడ్డారని.. దీంతో అదనపు కట్నం తేవాలి అంటు తన భార్యను వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ నటుడు పైన కేసు నమోదు కావడంతో అటు వరకట్న వేధింపులే కాకుండా గృహహింసపై కూడా చర్చలు మొదలయ్యాయి.
సినీ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన యువ నటుల వ్యక్తిగత జీవితాలలో ఇవే ఎక్కువగా వినిపిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా వస్తున్న అవకాశాలను వినియోగించుకోకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల వచ్చే అవకాశాలు కూడా చెడగొట్టుకుంటున్నారు యువ నటీ నటులు. ధర్మ మహేష్ ను పోలీసులు సైతం విచారణ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ విషయంపై నటుడు ధర్మ మహేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇక మీదట నైన ఇలాంటి పనులు మరే యువనటులు చేయకుండా ఉండాలని పలువురు నేటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు.