ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీమణులలో రష్మిక మందన , జాహ్నవి కపూర్ ముందు వరసలో ఉంటారు. వీరిద్దరూ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. కన్నడ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక్కడ కూడా మంచి విజయాలను దక్కించుకున్న ఈమె ఆ తర్వాత తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం ఈమె తెలుగు , తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇక హిందీ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన జాన్వి కపూర్ అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న పెద్ది అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే దేవర 2 అనే తెలుగు మూవీ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక దామ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్వి కపూర్ ప్రస్తుతం పరం సుందరి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించిన సినిమాల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: