టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చిన్న తనంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితమే హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ తో తేజ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హనుమాన్ లాంటి భారీ విజయం తర్వాత తేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన తేదీ ... వేదికను ఖరారు చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ గనుక ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: