సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమాను రూపొందిస్తున్న సమయంలో ఆ మూవీలో కొన్ని పాత్రల్లో కొంత మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు నటించినట్లయితే ఆ పాత్ర ఈమేజ్ మరింతగా పెరుగుతుంది. అలాగే సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుతూ ఉంటాయి. దానితో అనేక మంది ఫిలిం మేకర్స్ ఒక సినిమాలో ఏదైనా కీలక పాత్ర ఉంది అంటే దానిలో అద్భుతమైన క్రేజ్ ఉన్న వారిని తీసుకోవాలి అనే ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

అన్ని కుదిరి వారు నటించినట్లు అయితే ఆ సినిమాపై క్రేజ్ పెరగడం , సినిమా విడుదల అయ్యాక ఆ సినిమా బాగుండి , అందులో ఆ నటి లేదా నటుడి పాత్ర అద్భుతంగా ఉన్నట్లయితే ఆ మూవీ మరింత పెద్ద విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో చిన్న నాటి పవన్ కళ్యాణ్ పాత్రలో పవన్ కళ్యాణ్ కుమారుడు అయినటువంటి అకిరా నందన్ నటించినట్లు ఓ వార్త చాలా రోజులుగా వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ మూవీ లో మెగా హీరోలు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ కూడా కీలకమైన పాత్రలలో నటించనున్నట్లు , వీరిద్దరి పాత్ర నిడివి ఈ సినిమాలో తక్కువ గానే ఉండనున్నట్లు , కానీ సినిమా కథను మలుపు తిప్పే పాత్రలలో వీరిద్దరూ  కనిపించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే ఈ సినిమాలో అఖీరా నందన్ , సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ కూడా నటించినట్లయితే ఈ సినిమా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాలో అఖీరా నందన్  , సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ నటిస్తారా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: