అందం అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కమలినీ ముఖర్జీ ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయట్లేదు.. అవకాశాలు ఇచ్చినా సరే తెలుగు సినిమాలకు ఓకే చేయడం లేదట. దానికి కారణం అదే అంటుంది ఈ హీరోయిన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమలినీ ముఖర్జీ తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కారణం అదే అంటూ మాట్లాడింది. కమలినీ ముఖర్జీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించాను. ఎన్నో హిట్ సినిమాల్లో భాగమయ్యాను. కానీ నేను తెలుగులో నటించిన ఓ సినిమాలో నఆ పాత్ర నాకు అస్సలు నచ్చలేదు.ఆ పాత్ర వల్ల చాలా నిరాశ పడ్డా. అందుకే అప్పటినుండి తెలుగు సినిమాల్లో  నటించకూడదని ఫిక్స్ అయ్యాను. 

ఆ క్యారెక్టర్ బాగుంటుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను.కానీ తీరా సినిమా విడుదలయ్యాక పాత్ర అస్సలు బాలేదు. అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు. అలాగే నేను నటించిన హీరోలలో శర్వానంద్ చాలా న్యాచురల్ గా ఉంటారు. ఆయన నేను పెద్ద స్టార్ ని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. చాలా అంకితభావంతో పనిచేస్తారు.ఇక నాగార్జున గారు ఇప్పటికి కూడా అలాగే హ్యాండ్సమ్ గా ఉంటున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కమలినీ ముఖర్జీ. అయితే ఈ హీరోయిన్ కి అసంతృప్తిని కలిగించిన పాత్ర ఏంటి అని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.

ఇక ఆనంద్,గోదావరి, గోపి గోపిక గోదావరి,స్టైల్,మా అన్నయ్య బంగారం, గమ్యం వంటి సినిమాలతో పాటు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసింది. అయితే కమలినీ ముఖర్జీ చివరగా నటించిన తెలుగు సినిమా గోవిందుడు అందరివాడేలే.. ఈ సినిమాలో రామ్ చరణ్ పిన్ని పాత్రలో శ్రీకాంత్ కి కాబోయే భార్య పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర తనకు సంతృప్తి ఇవ్వలేదు కావచ్చు. అందుకే తెలుగు సినిమాలకు ఈ హీరోయిన్ దూరమైందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: