
ఇటీవలే చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై ఒక సాంగ్‌తో పాటు పలు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలిసింది. అయితే ఇందులో అత్యంత హైలెట్‌గా మారిన వార్త ఏమిటంటేఈ భారీ యాక్షన్ సీన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి డూప్ వాడకుండా స్వయంగా నటించబోతున్నాడట. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆనందం తో పాటు కొంచెం టెన్షన్ కూడా మొదలైంది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి హై రిస్క్ యాక్షన్ సీన్స్‌లో డూప్స్ వాడటం కామన్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈ విషయంలో ఎప్పటిలాగే వెనకడుగు వేయలేదట. ఎన్టీఆర్ స్వయంగా డూప్ లేకుండా అన్ని యాక్షన్ సీన్స్ చేయాలని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే స్టంట్స్ కూడా ఎన్టీఆర్ చేతనే చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారని సమాచారం.
ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం అంటే నిజంగా సాహసమే. అభిమానులు ఎన్టీఆర్ ధైర్యాన్ని చూసి గర్వపడతారు కానీ ఆయన చేసే ఆ రియల్ స్టంట్స్‌ను చూసేంతవరకు గుండెల్లో ఒక చిన్న భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ హై ఫిజికల్ ఎనర్జీతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆ యాక్షన్ సీన్స్‌ను స్వయంగా చేయడం వల్ల సినిమాలో రియలిజం మరింతగా పెరుగుతుంది. అదే సమయంలో ఆయన సేఫ్టీ పట్ల కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ఆందోళన ఉంటుంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వం అంటేనే టేకింగ్ స్టైల్, యాక్షన్ డిజైనింగ్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. ఆయన స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కొత్త లెవెల్‌కి చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి, ఎన్టీఆర్ చూపించిన అద్భుతమైన డెడికేషన్ గురించి ప్రతి ఒక్కరూ హైలైట్‌గా మాట్లాడకుండా ఉండలేరని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. భారీ రిస్క్‌లను తన భుజాలపై వేసుకుని డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్స్ చేయడం ద్వారా ఎన్టీఆర్ మరోసారి తానేంటో నిరూపించుకోబోతున్నాడు.