
ప్రస్తుతం శివ కార్తికేయన్ రెండో క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో `మదరాసి` ఒకటి కాగా.. మరొకటి `పరాశక్తి`. వీటిలో మురుగదాస్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మదరాసి సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ ద్వారా మేకర్స్ మరింత బజ్ పెంచుతున్నారు.
అయితే తాజాగా మదరాసి ప్రమోషనల్ ఈవెంట్ లో శివ కార్తికేయన్ తన కెరీర్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ఒకవేళ తాను హీరో కాకపోయి ఉంటే ఏం చేసేవాడ్నో వివరించారు. లైఫ్‌లో ప్లాన్ ఎ, ప్లాన్ బి ఉండాలంటారు. అలాగే శివ కార్తికేయన్ కూడా రెండు ప్లాన్స్ రెడీ చేసుకున్నాడు. చిన్ననాటి నుండి ఆయనకు మిమిక్రీ, స్టేజ్ షోలు చేసే ఆసక్తి ఉండేది. అదే శివ కార్తికేయన్ ను టెలివిజన్ రంగంలోకి, ఆ తరువాత సినిమాల దారిలోకి నడిపింది.
ఒకవేళ తాను సినిమాల్లోకి రాకుండా ఉండుంటే, నటుడ్ని కాకపోయుంటే పోలీస్ అయ్యేవాడ్ని అని శివ కార్తికేయన్ పేర్కొన్నారు. తన తండ్రి పోలీస్ కాబట్టి తాను కూడా అదే ప్రొఫెషన్ ను ఎంచుకునేవాడ్ని అని స్పష్టం చేశారు. దీంతో శివ కార్తికేయన్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, శివగంగ జిల్లాలో సింగంపునారిలోని ఒక తమిళ కుటుంబంలో శివ కార్తికేయన్ జన్మించాడు. అతని తండ్రి జి. డాస్ జైలు సూపరింటెండెంట్ కాగా.. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. ఆమె డాక్టర్ కావడం విశేషం.