
పదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి ఇలా మాస్ ఇంపాక్ట్ రోల్‌లో రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ హల్‌చల్ చేస్తోంది – అదేంటంటే, మనోజ్ ఇకపై విలన్ రోల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడట. ఇక ఈ రూమర్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేది ఒక గట్టి వార్త. తాజాగా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ సినిమాలో మనోజ్ విలన్‌గా వచ్చే ఛాన్స్ ఉందని ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. బాబీ డైరెక్షన్‌లో ఈసారి ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో విలన్ రోల్‌ని చాలా బలంగా రాసుకున్నాడని సమాచారం. ఇదే సమయంలో ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఉన్నాడు. ఆయనతో ఇప్పటికే మనోజ్ కలసి పనిచేశాడు కాబట్టి, మనోజ్‌కి ఓకే చెప్పే అవకాశం ఎక్కువగానే కనిపిస్తోంది.
ఇక్కడ అసలు హైలైట్ ఏంటంటే – చిరంజీవికి విలన్‌గా ఇంతకుముందు మనోజ్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించారు. ఇప్పుడు అదే లెగసీని ఆయన తనయుడు మనోజ్ కొనసాగిస్తే అది నిజంగా మాస్ ట్రీట్ అవుతుంది. మెగాస్టార్‌తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసే విలన్‌గా నిలవడం అంటే ఏ నటుడికైనా ఓ మైలురాయి. అంతేకాదు, వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ రాసుకున్న ఈ కథలో వింటేజ్ చిరంజీవిని చూపించేలా మాస్ ప్యాకేజీ ఉందని టాక్. అందులో మనోజ్ విలన్‌గా నిలిస్తే, ఆయన కెరీర్‌కి రీ-ఎంట్రీ కాకుండా రీ-లాంచ్ అన్నట్టే అవుతుంది. మొత్తానికి, మంచు మనోజ్ మాస్ విలన్‌గా చిరంజీవికి ఎదురుపడతాడని వార్త నిజమైతే – అది టాలీవుడ్‌లోనే కాక, పాన్-ఇండియా స్థాయిలోనూ పెద్ద సెన్సేషన్‌గా నిలుస్తుంది. యాక్టర్‌గా తన ప్రతిభను రుజువు చేసుకున్న మనోజ్‌కి ఇకపై అవకాశాలు వర్షం కురిసే అవకాశం ఖాయం.