RBI క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి పెద్ద షాక్ ఇస్తూ కొన్ని రూల్స్ ని మార్చింది. ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించలేరు, అలాగే ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి ప్రధాన ప్లాట్ ఫామ్ వంటి లావాదేవులకు(ఫిన్ టెక్) సంబంధించి ఫీచర్ ని నిలిపివేశాయి.. అయితే వీటి ద్వారా రివార్డ్స్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు వస్తూ ఉండడంతో వీటిని చాలామంది ఉపయోగించేవారు.2025 సెప్టెంబర్- 15 నుంచి ఆర్బిఐ కొత్త నియమాలను జారీ చేయడంతో ఈ ఫీచర్లను నిలిపివేసింది.



RBI నిబంధనల ప్రకారం .. చెల్లింపులకు సంబంధించి అగ్రిగేటర్ గా పనిచేసేటువంటి ప్రత్యేకించి కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కలిగి ఉన్న వ్యాపారులకు మాత్రమే ఈ డబ్బు చెల్లించగలరు.. ఈ జాబితాలలో ఇంటి యజమానులను చేర్చలేదు. కాబట్టి ఇకమీదట ఫిన్ టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె ఇంటి యజమానులకు బదిలీ చేయలేరు ఆర్బిఐ  తెలియజేస్తోంది. అయితే ఈ నిబంధనను తీసుకురావడం వెనుక KYC నిబంధనలో ఉల్లంఘనలు, పెరుగుతున్న మోసాలే కారణం అంటూ ఆర్బిఐ వెల్లడించింది.


క్రెడిట్ కార్డు ద్వారా అద్దె  చెల్లింపు విషయంలో సరైన ధ్రువీకరణ పత్రాలు కనిపించడం లేదని ఆర్బిఐ గుర్తించింది. అద్దె ముసుగులో చాలామంది బంధువుల ఖాతాలకు ఈ డబ్బులను తరలిస్తూ ఆ డబ్బులను చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారని.. దీని ఫలితంగా సరైన ధ్రువీకరణ లేకుండా ఇకపైన ఇలాంటి లావాదేవులు నిర్వహించలేమంటూ ఆర్బిఐ నిర్ణయించుకుంది. అందుకే ఇకమీదట క్రెడిట్ కార్డులు ఉపయోగించి అద్దెను చెల్లించడం నిషేధంక పేర్కొంది ఆర్బిఐ. 2024లో క్రెడిట్ కార్డులను ఉపయోగించి అద్దె చెల్లించడం వంటివి కొన్ని ప్లాట్ ఫామ్ లు నిలిపివేశాయి. ఇప్పుడు ఆర్బిఐ తో కొత్త నిబంధనల ప్రకారం ఈ సెప్టెంబర్ 15 నుంచి మరికొన్ని ఫిన్ టెక్ కంపెనీలు ఈ ఫీచర్ ని పూర్తిగా నిలిపివేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: