సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగడం ఒక్కటే పెద్ద విషయం కాదు. హీరోగా స్టార్ ఇమేజ్ రాకపోయినా, జనాలకి ఉపయోగపడే, ఆలోచన కలిగించే, మేల్కొలిపే కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కేటగిరీకి వస్తే హీరో సిద్ధార్థ్ ఎప్పుడూ ఫస్ట్ రోల్ మోడల్‌గా నిలుస్తారు. సిద్ధార్థ్‌కి పెద్దగా కమర్షియల్ రేంజ్ సినిమాలు చేయాలనే తొందర ఉండదు. సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు కమిట్ అయి, డబ్బులు సంపాదించి ఆస్తులు పెంచుకోవాలని చూసే టైప్ ఆయన కాదు. మూడేళ్లకో, నాలుగేళ్లకో ఒక సినిమా వచ్చినా, అందులో కంటెంట్ ఉండాలి, పాజిటివ్ మెసేజ్ ఉండాలి, జనాల మనసుకి తాకాలి అనేది ఆయన ధోరణి. అందుకే ఆయన కెరీర్ పేస్ నెమ్మదిగా, స్లోగా ముందుకు సాగుతున్నా, ఆయన ఎంపిక చేసిన సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి.


ఇటీవలే "3 BHK" మూవీలో నటించి మంచి హిట్ అందుకున్న సిద్ధార్థ్, ఇప్పుడు మరొక జాక్పాట్ ఛాన్స్ కొట్టేశాడు. తాజాగా ఆయన ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్త బయటకు వచ్చింది. "ఛుస్తొమిజెద్ ఏఅర్థ్" అనే పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌కి మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. తమిళం, తెలుగు భాషలలో ఈ సిరీస్ ఒకేసారి తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఫ్రిధా పింటో కథానాయికగా నటిస్తుండగా, రితేష్ భద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ టెలివిజన్‌తో కలిసి జాన్ వెజ్ ప్రొడక్షన్ ఈ సిరీస్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇది పూర్తిగా ప్రేమ, పెళ్లి, కుటుంబం, సంస్కృతి, సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందుతున్న సిరీస్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు దీన్ని చూసి కనెక్ట్ అవుతారని, ఎంజాయ్ చేస్తారని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



ఈ వెబ్ సిరీస్‌లో కథ కూడా చాలా రియలిస్టిక్‌గా, లైఫ్‌తో ముడిపడి ఉండేలా ఉంటుంది. ఒక బాధ్యతగల గృహిణి తన మాజీ ప్రియుడిని మళ్లీ కలుసుకున్నప్పుడు ఆమెకు పాత రోజులు గుర్తొస్తే, ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా మారుతుంది? ఆమె కుటుంబంలో ఏ విధమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి? అనేదే ప్రధాన కాన్సెప్ట్. అలాగే ఒక వ్యాపారవేత్త తన బిజినెస్, ప్రేమను బ్యాలెన్స్ చేయలేకపోతే ఏలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు? అనే మరో ఆసక్తికర కోణాన్ని కూడా ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. ఇలాంటి రెండు వేర్వేరు కథాంశాలను సమతౌల్యంగా కలిపి, వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో నటించడం సిద్ధార్థ్ వేసిన ఒక పెద్ద అడుగు అని చెప్పాలి. ఆయన ఇప్పటివరకు ఎంచుకున్న సినిమాల్లాగే ఇది కూడా మరో “బొమ్మరిల్లు” తరహా మాస్టర్‌పీస్‌గా ఆయన కెరీర్‌లో నిలిచిపోతుందని, ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. సిద్ధార్థ్‌కి ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అవకాశం కాదు, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చూపించుకునే ఒక వేదిక. కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ, రియాలిటీ బేస్‌డ్ సబ్జెక్ట్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ ఆయన కెరీర్‌ను డిజైన్ చేసుకుంటున్న తీరు నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: