టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన పేరు డీవీవీ దానయ్య. ఆయన సినీ ప్రయాణం చిన్న సినిమాతో మొదలై, ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో నిలబడటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయం. 33 ఏళ్ల క్రితం ‘జంబలకిడి పంబ’ మూవీతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన .. జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయ‌క్, బ్రూస్ లీ, ధృవ, విన్నర్ వంటి ఎన్నో హిట్ మూవీస్‌ను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే దానయ్య కెరీర్‌లో మలుపుతిప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. కేవలం బాక్సాఫీస్ వద్దే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆస్కార్ స్థాయిలోనూ rrr బ్లాస్ట్ అవ్వడంతో, దానయ్య పేరు ప్రపంచానికి తెలిసింది.

ముఖ్యంగా ఈ సినిమా ద్వారా ఆయన పెట్టిన బడ్జెట్ కన్నా ఊహించని లాభాలు వచ్చి, ‘లక్కీ ప్రొడ్యూసర్’ అనే బిరుదు కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన *ఓజీ (They Call Him OG)*తో దానయ్య మళ్లీ రిస్క్ తీసుకున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్‌లో, తన కొడుకు కళ్యాణ్ దాసరితో కలిసి దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ.200 కోట్లకు పైగానే వెళ్లిందని టాక్. హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ కలిపి దాదాపు రూ.100 కోట్లు, అలాగే నిర్మాణ, ప్రమోషన్ ఖర్చులు మరో రూ.100 కోట్లు అయ్యాయని తెలుస్తోంది. కానీ ఈ భారీ బడ్జెట్ ఉన్నా కూడా, ఓజీ బిజినెస్ అదిరిపోయిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్ (OTT, శాటిలైట్, ఆడియో) మాత్రమే రూ.113 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.

అలాగే థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.180 కోట్లకు పైగా సేల్ అయ్యాయని టాక్. మొత్తం కలిపి రూ.300 కోట్లు వసూలు చేసింది. అంటే బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తాన్ని రిలీజ్‌కు ముందే రికవరీ చేసేశాడు దానయ్య. దీంతో ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి – “ఆర్ఆర్ఆర్‌ తరహాలోనే, ఓజీతో కూడా దానయ్యకు అదృష్టం కలిసొచ్చింది” అని. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయం అంటున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ క్రేజ్ దానయ్యకు మళ్లీ బంగారు బాట వేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద.. డీవీవీ దానయ్య లక్ మళ్లీ పునరావృతం కావడం ఖాయం అంటున్న ట్రేడ్ వర్గాలు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఓజీ కూడా బ్లాక్‌బస్టర్ లాభాలను తెచ్చిపెడుతుందా అన్నది చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: