
టాలీవుడ్‌లో ఎట్టకేలకు ఎదురు చూపులకు తెరదించుతూ ఓజీ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గత రాత్రి సెకండ్ షో నుంచే ఓజీ ప్రీమియర్ల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఫైనల్‌గా టాక్ ఎలా ఉంది ? సినిమా హిట్టేనా ? సినిమా చూడొచ్చా ? అంటే ఇండియా హెరాల్డ్ ఖచ్చితంగా సినిమా ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చుతుంది. సగటు సినీ అభిమానిని కూడా మెప్పిస్తుందనే చెపుతుంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి, స్టార్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టు పవన్ కల్యాణ్‌కి కథేం అవసరం లేదు. పవన్ తెరమీద కనిపిస్తూ మ్యాజిక్ చేస్తే చాలు. అయితే ఓజీ సినిమా కోసం సుజిత్ ఓ స్ట్రక్చర్ ఉన్న కథ రెడీ చేసుకున్నాడు. కథ అయితే రొటీన్ గానే ఉంది.
ఇలాంటి కథను మనం గతంలో చాలాసార్లు చూశాం. అయితే అందరికి తెలిసిన కథనే సుజిత్ తనదైన స్టైల్ మేకింగ్‌తో .. పవన్ ఇమేజ్‌కు తగినట్టుగా అదిరిపోయే ఎలివేషన్లు రెడీ చేసి కాస్త కొత్తగా మార్చాడు. సినిమా స్టార్ట్ అయ్యాక 25 నిమిషాల వరకు పవన్ తెరమీద కనిపించడు. అయినా కూడా విజిల్ మూమెంట్స్‌కు కరువు లేదు. కమర్షియల్ సినిమాల్లో అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఇంత లేటుగా ఎంట్రీ ఇచ్చినా సినిమా ను మ్యాజిక్‌తో ఎంగేజ్ చేశాడంటే సుజిత్ ఎలివేషన్లు, మ్యాజిక్ ఎలా వర్కవుట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఫస్టాఫ్‌లో పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ. కానీ ప్రతీ సీన్‌లోనూ పవన్ ఉన్నట్టే ఉంటుంది. పవన్ కనిపించే ప్రతి ఫ్రేము అదరగొట్టేస్తుంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ అయితే పైసా వసూల్ మూమెంట్స్ అని చెప్పాలి. ఎలివేషన్లుకు కరువు లేదు. ఒక్క మాటలో ఓజీ గురించి చెప్పాలంటే.. ఇది పవన్ ఫ్యాన్స్ కు పండుగ . తమ హీరోని ఎలా చూడాలనుకొంటున్నారో సుజిత్ అలా చూపించేశాడు. ఫ్యాన్స్‌కు సినిమా పిచ్చి ఎక్కిస్తుంది. మరి సాధారణ ప్రేక్షకుడు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనేదానిపై ఓజీ రేంజ్ ఆధారపడి ఉంటుంది.