తమిళంలో స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడిగా  పేరుపొందిన విజయ్ ఇంటికి తాజాగా బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. శనివారం రోజున రాత్రి విజయ్ సభలో జరిగిన తొక్కిసులాటలో 39 మంది మరణించగా చాలామంది విజయ్ ని వ్యతిరేకిస్తున్నారు. విజయ్ తన ర్యాలీలో మృతి చెందిన వారిని తలుచుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురై.. ఒక్కొక్కరికి రూ.20 లక్షల రూపాయలు, గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ .2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీసులు భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు.


అయినప్పటికీ ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతాలలో చెన్నైలోని ECR, నీలంకరణిలో నివాసం ఉంటున్న విజయ్ ఇంటికి కొంతమంది దుండగులు బాంబులు పెట్టినట్లుగా రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు ఈమెయిల్ చేశారు. అలాగే హీరో విజయ్ ఇంటికి ఫోన్ చేసి మరి మరి కొద్ది సేపట్లో ఇంటిని కూల్చేస్తున్నామంటూ బెదిరించారట. ఈ విషయం విన్న వెంటనే అధికారులు హుటా హుటిగా బాంబు స్క్వాడ్ తో హీరో విజయ్ ఇంటి లోపల, బయట అణువణువు  తనిఖీ చేశారు. కానీ ఇంటి లోపల బయట ఎటువంటి బాంబుల ఆనవాలు కనిపించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం విన్న అభిమానులు కూడా మొదట ఆందోళన పడ్డ ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.


అసలు ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరు? ఏ ఉద్దేశంతో ఇలాంటి బెదిరింపులు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన తర్వాత చాలామంది విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధర్నాల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమై హీరో విజయ్ ను సురక్షిత ప్రాంతానికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. అలాగే హీరో విజయ్ ఇంటి సమీప ప్రాంతంలో కూడా కొన్ని నిబంధనలను పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: