టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ఫ్యామిలీ పరంగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ వారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు తారక్ . త్రిబుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు . రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ తారక్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచిందని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ . ఇక తాజా గానే ఓ మూవీ షూటింగ్లో తారక్కు మైనర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే .


అయినప్పటికీ రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార మూవీ ఈవెంట్ కు పాల్గొన్నాడు తారక్ . రిషబ్ పై ఉన్న అభిమానంతోనే తన నొప్పిని సైతం లెక్కచేయకుండా ఈవెంట్లో హాజరయ్యాడు . కానీ పెద్దగా సందడి చేయలేకపోయాడు . మైనర్ ఆక్సిడెంట్ వల్ల జరిగిన గాయాలు నొప్పి పుట్టడంతో ఫాన్స్ తో పెద్దగా మాట్లాడలేకపోయాడు తారక్ . కానీ మాట్లాడిన కొన్ని మాటలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఇక ఈవెంట్ లోనే రిసెప్ట్ శెట్టి తనకు చేసిన సహాయం గురించి తెలిపాడు ఎన్టీఆర్ . తన తల్లి 60 ఏళ్ల కళను రిషబ్ షటి తీర్చినట్లు వెల్లడించాడు . తారక్ మాట్లాడుతూ.." మా అమ్మగారికి ఎప్పటినుంచో ఉండే కోరిక.. ఉడిపి కృష్ణుడు గుడికి వెళ్లాలని .


నేను ఒకసారి తీసుకు వెళ్లినప్పుడు రిషబ్ నాకు సహాయం చేశాడు . థాంక్యూ రిషబ్ సార్ . రిషబ్ సార్ లేకపోతే ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు . పనులన్నీ మానుకుని నాతో మా అమ్మతో ఆయన గాని ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యులు లాగా.. గుడులకు తీసుకువెళ్లి ఆశీర్వాదం ఒప్పించి.. ఆయన సొంత కుటుంబ సభ్యుడు లాగా చూసుకున్నారు నన్ను . థాంక్యూ సో మచ్ రిషబ్ సార్ ... " అంటూ రిషబ్ చేసిన సహాయాన్ని వెల్లడించాడు తారక్ . ప్రెసెంట్ ఎన్టీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: