
సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కథలో ఉన్న ఎమోషనల్ టచ్, కుటుంబ విలువల మేళవింపుతో ఓజీ కేవలం మాస్ సినిమా కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా నచ్చేలా మారింది. ఇక ఓజీ వసూళ్ల విషయానికొస్తే, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రు. 303 కోట్ల గ్రాస్‌తో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కానీ “ఓజీ” ఆ రికార్డును బ్రేక్ చేస్తూ రు. 310 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో 2025లో తెలుగు సినిమా నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా “ఓజీ” నిలిచింది.
ప్రస్తుతం తగ్గిన టికెట్ ధరలు కూడా సినిమాకు ప్లస్‌గా మారాయి. దాంతో సెకండ్ వీక్‌లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్లు కొనసాగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, సినిమా లాంగ్ రన్‌లో రు. 350 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. థమన్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లను మరింత ఎలివేట్ చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా అగ్రశ్రేణిలో నిలిచింది. మొత్తానికి, “ఓజీ” పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఆయన స్టార్ ఇమేజ్ మరింత బలపడగా, టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి పవర్‌స్టార్ పవర్ ఏంటో చూపించింది.