మెగా ఫ్యామిలీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు కూడా ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవి ప్రస్తుతం మల్లడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించకపోయిన కొంత కాలం క్రితం చిరంజీవి ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో శ్రీ లీల , రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోలు నటించిన సినిమాలు వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: