టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “ దేవర ” సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో “ దేవర పార్ట్–2 ” పై ఇప్పుడు ఇండస్ట్రీ అంతా దృష్టి పెట్టింది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ సీక్వెల్ స్క్రిప్ట్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. వచ్చే వారంలో ఎన్టీఆర్‌కు పూర్తి నేరేషన్ ఇవ్వాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సీక్వెల్‌లో కథలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదటి భాగంలో ఉన్న భావోద్వేగం, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కి తోడు ఈసారి కథలో మరింత డ్రామా, కొత్త థీమ్‌లు జోడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవర పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా తీర్చిదిద్దినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే ఇందులో ఒక కొత్త కీలక పాత్రను కూడా డిజైన్ చేశారని, ఆ రోల్ కథలో మేజర్ ట్విస్ట్‌గా నిలుస్తుందని అంటున్నారు. “దేవర పార్ట్–2” కోసం పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. ఈ సీక్వెల్‌లో యాక్షన్ సన్నివేశాలు మరింత గ్రాండ్‌గా, విజువల్ ట్రీట్‌లా ఉండబోతున్నాయి. జాన్వీ కపూర్‌తో పాటు మరో హీరోయిన్ ఈ భాగంలో కనిపించనుందట‌. ఇక విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరోసారి శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.


అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు టెక్నిక‌ల్‌గా మరింత రిచ్ లుక్ ఇవ్వాలని టీమ్ భావిస్తోంది. డిసెంబర్‌లో షూట్ ప్రారంభం కానున్న ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. “దేవర పార్ట్–1” ఇచ్చిన ఎమోషనల్ హై తరువాత ఈ సీక్వెల్ ఎంత రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: