టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మ్యూజిక్ డైరెక్టర్‌ థమన్‌ కాంబినేషన్‌ ఎప్పుడూ హిట్‌గా నిలిచింది. ఆలా వైకుంఠపురములో, గుంటూరు కారం వంటి సినిమాల్లో థమన్‌ అందించిన సంగీతం సినిమాలకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌ నుంచి వచ్చే మ్యూజిక్‌ ఆల్బమ్‌లు అభిమానుల్లో భారీ అంచనాలను
పెంచేసేవి. తాజాగా వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రానికి థమన్‌ స్థానంలో హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ ఎంపిక కావడంతో టాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.


ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు తలెత్తాయా ? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. అయితే వాస్తవానికి అలాంటి విభేదం ఏదీ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం థమన్ చాలా పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు, రామ్ చరణ్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోల ప్రాజెక్టుల కోసం ఆయన ఒకేసారి మ్యూజిక్‌ పనులు చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌ సినిమాకు అవసరమైన సమయం ఆయన కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది.


అంతేకాకుండా థమన్‌ రెమ్యూనరేషన్‌ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉండటం వల్ల నిర్మాతలు కొంత ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ మరియు మేకర్స్‌ ఇద్దరూ కలసి, మంచి మ్యూజిక్‌ సెన్స్‌తో పాటు కథకు తగ్గ భావోద్వేగ టచ్‌ ఇచ్చే కాంపోజర్‌గా పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ను ఎంపిక చేశారు. అర్జున్ రెడ్డి, ఆనందో బ్రహ్మ, ఈగల వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, వెంకటేష్‌ సినిమాలో కొత్త సౌండ్‌ అనుభూతిని ఇవ్వబోతున్నాడని టాక్‌. దీంతో త్రివిక్ర‌మ్ - థ‌మ‌న్ మ‌ధ్య విబేధాలు లేవ‌ని.. ఇది పూర్తిగా ప్రొఫెషనల్‌ నిర్ణయం మాత్రమే అని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు టాలీవుడ్‌లో నెలకొంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: