
ఈ సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా, అలాగే ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ చిత్రాలపై సెన్సేషనల్ అప్‌డేట్ ఇచ్చారు. వాళ్ళు మాట్లాడుతూ “ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ గారితో రూపొందుతున్న చిత్రం చాలా భారీ స్థాయిలో ప్లాన్ అవుతోంది. ధర్డ్ షెడ్యూల్ దాదాపు పూర్తయింది. మిగిలిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం 2026లో లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించే ప్రాజెక్ట్ అవుతుంది,” అని తెలిపారు.
అలాగే, వారు మరో సూపర్ అప్‌డేట్ కూడా ఇచ్చారు —“ప్రభాస్ గారు నటించే తదుపరి సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతుంది. ఇది భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ గ్రాండియర్ కలయికగా తెరకెక్కుతుంది. అంతా అనుకున్నట్లే సాగితే ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే 2026 ఆగస్టు నాటికి విడుదల చేయాలని మా ప్లాన్,” అని మైత్రి మేకర్స్ వెల్లడించారు. నిర్మాతలు చెప్పిన ఈ రెండు అప్‌డేట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు “ఇదే మైత్రి మేకర్స్ స్టైల్!” అంటూ సంబరపడుతున్నారు. రెండు ఇండస్ట్రీ బిగ్ స్థాయి బిగ్ ప్రాజెక్టులు – ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో, మరొకటి రిబెల్ స్టార్ ప్రభాస్‌తో – ఒకే బ్యానర్‌లో రాబోతుండటంతో సినీప్రియులంతా హుషారుగా ఉన్నారు.దీనితో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ ఏడాది డ్యూడ్ తో మరియు వచ్చే ఏడాది ఫౌజి, డ్రాగన్ తో రెండింటికీ టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ అందించినట్టే అయ్యింది.