
అయితే ఈసారి మాత్రం ఎల్లమ్మ కథ వినగానే తనకు బాగా నచ్చడంతో చివరికి హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరో నాని, ధనుష్, నితిన్ వంటి వారి పేర్లు పరిశీలనలో వినిపించాయి. కానీ ఇప్పుడు చివరికి ఏకంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫైనల్ గా నటించబోతున్నారని వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఒక సోషియల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నది.
ఇలాంటి తరుణంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరొక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే దేవిశ్రీప్రసాద్ కి జోడిగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేయబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజ్ బ్యానర్ పై కీర్తి సురేష్ , విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటించబోతోంది ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్టులో కూడా ఈమె ఎంపిక చేయాలని చూస్తున్నట్లు వినిపిస్తోంది. అని అనుకున్నట్టు కుదిరితే దేవిశ్రీప్రసాద్, కీర్తి జోడిని తెర పైన చూడవచ్చు. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి తరుణంలో ఇలాంటి రిస్కులు అవసరమా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.