సినిమా ఇండస్ట్రీ లో 1980's , 1990's కాలంలో అగ్ర హీరోలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగిన వారిలో చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ ఉంటారు. వీరు నలుగురు కూడా దాదాపు ఒకే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగించారు. ఎన్నో విజయాలను అందుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను సాధించారు. వీరు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో వీరి అభిమానుల మధ్య అనేక గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానితో వీరంతా కూడా మేము ఎంతో స్నేహంగా ఉన్నాం.

మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మీరు కూడా ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దు అనే సంకేతాలను ఇవ్వడం కోసం వీరంతా వెండి తెరపై కాకపోయినా మామూలు ప్రాంతాలలో కలిసి అందుకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను విడుదల చేస్తూ ఉండేవారు. దానితో వీరి అభిమానులు కూడా ఎంతో కొంత కలిసిపోయే అవకాశాలు ఉండేవి. ఇప్పటికి కూడా ఈ నలుగురు హీరోలు తెలుగు శని పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ నలుగురిలో చిరంజీవి , బాలకృష్ణ మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ , చిరంజీవి ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం , దానిపై చిరంజీవి కూడా స్పందించడంతో ఆ వ్యాఖ్యలు భారీగా వైరల్ అయ్యాయి. తాజాగా జరిగిన ఒక విషయంతో చిరంజీవి , బాలకృష్ణ కు సంబంధించిన వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా చిరంజీవి తన ఇంట్లో దీపావళి వేడుకలను నిర్వహించాడు. వాటికి నాగార్జున , వెంకటేష్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. అలాగే ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ మూవీ హీరోయిన్ అయినటువంటి నయనతార కూడా చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు వచ్చింది. ఇక ఈ వేడుకలలో చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ అటెండ్ అయ్యి బాలకృష్ణ కాకపోవడంతో ఎందుకు బాలకృష్ణ రాలేదు అనే విషయంపై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: