- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . . 

టాలీవుడ్‌లో రికార్డులు సృష్టించడం, వాటిని మరొకరు బద్ధలుకొట్టడం సాధారణ విషయమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఈ పోటీలో భాగమైంది. సినిమాల ప్రమోషనల్ పోస్టులు, ఫస్ట్ లుక్ పోస్టర్లు లేదా టీజర్లు ఇవి ఇప్పుడు రికార్డుల కొలమానాలుగా మారాయి. అలాంటి రికార్డుల్లో ఒక‌టి ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో ఉంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2: ది రూల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ లో సెన్సేషన్ సృష్టించింది. ఆ పోస్టర్‌కు ఏకంగా 2.85 లక్షల లైకులు, 14 మిలియన్ ఇంప్రెషన్‌లు వచ్చాయి. ఈ సంఖ్యలు తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ట‌చ్ చేయ‌లేని విధంగా ఉన్నాయి. దీంతో ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ పోస్ట్ ఇప్పటివరకు అత్యధిక రీచ్ సాధించిన తెలుగు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌గా నిలిచింది.


ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఒక్క హీరోకే ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో మ‌హేష్‌ చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్‌లో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని సమాచారం. రాజమౌళి స్పెషల్ ప్రెజెంటేషన్‌తో, ప్రపంచస్థాయి డిజైన్‌తో పోస్టర్ వస్తే, ‘పుష్ప-2’ రికార్డును బద్ధలుకొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. బన్నీ సృష్టించిన రికార్డు నిలబడుతుందా ? లేక మహేష్ - రాజమౌళి కాంబో దానిని చెరిపేస్తుందా ? అనేది ఇప్పుడు టాలీవుడ్ మరియు సోషల్ మీడియా వేదికలలో హాట్ టాపిక్‌గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ? మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: