టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అలా డిస్ట్రిబ్యూటర్ గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత సినిమాలను నిర్మించడం మొదలు పెట్టారు. ఈయన నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత వరస పెట్టి భారీ విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో అత్యంత తక్కువ కాలం లోనే ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈయన నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది.

చాలా సంవత్సరాల పాటు ఈయన సక్సెస్ ఫుల్ నిర్మాతగా కెరియర్ను ముందుకు కొనసాగించాడు. కెరియర్ను ప్రారంభించిన మొదటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తున్నాయి. ఈ సంవత్సరం ఈయన బ్యానర్ నుండి గేమ్ చెంజర్ , సంక్రాంతికి వస్తున్నాం , తమ్ముడు అనే మూడు సినిమాలు వచ్చాయి. ఇందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మినహాయిస్తే గేమ్ చేంజర్ , తమ్ముడు సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహ పరిచాయి. హిట్టు , ఫ్లాపులతో సంబంధం లేకుండా దిల్ రాజు ఎప్పుడు సినిమాలను నిర్మిస్తూ యాక్టివ్ ప్రొడ్యూసర్ గా కెరియర్ను ముందుకు సాగిస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన సైలెంట్ అయ్యాడు. ఈయన మరికొన్ని రోజుల్లోనే విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మూవీ ని నిర్మించబోతున్నాడు. వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు కానీ ఈ మూవీకి సంబంధించి హీరో ఎవరు అనేది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది.

ఈ సినిమాలను మినహాయిస్తే దిల్ రాజు బ్యానర్ కు సంబంధించి ఏ సినిమా అప్డేట్లు రావడం లేదు. దానితో దిల్ రాజు సైలెంట్ అయ్యాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. కానీ మరి కొంత మంది మాత్రం దిల్ రాజు భారీ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ , పవన్ కళ్యాణ్ హీరోలుగా సినిమాలు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అని , ఈ ఇద్దరు హీరోలతో ఇప్పటికే మూవీలను ఓకే చేసుకున్నాడు అని , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడనున్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: