ఆ ఫోటోల్లో వెంకటేష్, నాగార్జున, నయనతార వంటి స్టార్ హీరోలు కూడా కనిపించారు. ఆ ఫోటోల్లో చిరంజీవి, ఎక్కడా ఉపాసన ప్రెగ్నెన్సీ గురించిన చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇదే విషయం ఇప్పుడు అభిమానుల్లో, సోషల్ మీడియా వేదికల్లో పెద్ద చర్చగా మారింది. జనాలు ప్రశ్నిస్తున్నారు — “చిరంజీవి గారు ఎందుకు ఈ విషయం ముందుగా షేర్ చేయలేదు? కనీసం చిన్న హింట్అయినా ఇవ్వొచ్చుగా..!” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.“ఉపాసన ఈ వార్తను ప్రైవేట్‌గా ఉంచాలని, ఫ్యామిలీతో మాత్రమే పంచుకోవాలని కోరుకుందేమో. అందుకే చిరంజీవి గారు గానీ, రామచరణ్ గానీ ఈ విషయం బయటపెట్టలేదు,” అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు — ఈసారి దివాళి మెగా ఫ్యామిలీకి ఎంతో అదృష్టం తెచ్చింది. ఒక వైపు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతుండగా, మరో వైపు కుటుంబంలోకి మరో కొత్త జీవితానికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు.
ఉపాసన ఈ సంతోష వార్తను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా చాలా హృదయాన్ని తాకేలా ఉంది. ఆమె షేర్ చేసిన వీడియో చూస్తే ఎవరికైనా సర్ప్రైజ్ ఫీలింగ్ వస్తుంది. ఆ వీడియోలో ఉపాసన ముఖంపై కనిపించిన సంతోషం, ఆమె కళ్ళల్లో మెరిసిన మమకారం, రామ్ చరణ్ చూపిన ఆనందం – ఇవన్నీ చూస్తే కుటుంబంలో ఎంత బంధం, ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి