బ్లాస్టింగ్ రోర్ వీడియో విషయానికి వస్తే.. బాలకృష్ణని ఇందులో మాస్గా చూపించారు బోయపాటి శ్రీను. ముఖ్యంగా శివుడు చేతిలో ఉండే త్రిశూలాన్ని, నంది హైలైట్ చేస్తూ చూపించారు. బాలకృష్ణ ప్రత్యర్థులను చితక్కొడుతూ ఉన్నట్టుగా , అలాగే బాలయ్య చెప్పే డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడకా..ఊహకి కూడా అందదు అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉంది. ఇక బాలయ్య గర్జనకు గుర్రాల బెదిరిపోయి రంకెలు వేసినట్లుగా చూపించిన ఎలివేషన్ హైలైట్ గా ఉంది. చివరిగా అఖండ2 తాండవం అంటూ పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
బోయపాటి శ్రీను బాలకృష్ణను చూపించిన తీరు కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగులను కూడా అఖండ సినిమాకు మించి ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మరొకసారి తన మార్కును చూపించేలా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా తదితర నటీనటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అద్భుతంగా అందించినట్టు కనిపిస్తోంది.అయితే ఇందులో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది బాలయ్య. మరి ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి