సిచ్యువేషన్ షిప్:
అప్పటి పరిస్థితిని బట్టి ఒక రిలేషన్ ని క్రియేట్ చేసుకుంటారు.వీరి మధ్య బంధానికి ఎలాంటి హద్దులు ఉండకుండా, స్నేహితుల కంటే ఎక్కువగా పార్టనర్ కంటే తక్కువగా ఉంటారు. వీరి బంధానికి ఎలాంటి పేరు పెట్టలో వీరికే అర్థం కాదు.
డెల్యూషన్ షిప్:
ఇద్దరిలో ఒకే వ్యక్తికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, అవతలి వ్యక్తి తమని ప్రేమించకపోయినా సరే ప్రేమిస్తున్నారనే భ్రమలో బ్రతికేస్తుంటారు.
ఎవాల్యూషన్ షిప్ :
మొదట్లో ఈ రిలేషన్ లో ఉన్న వారు సాధారణంగానే ఉంటారు. రాను రాను వారి అనుబంధం బలపడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వెళ్తారు.
టెస్టింగ్ షిప్:
వీళ్ళు ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్ లు లేదా చాటింగ్ ద్వారా వీరి యొక్క మనోభావాలను తెలియజేస్తుంటారు.
బెంచింగ్ షిప్:
ఈ రిలేషన్లో ఒకరితో ఒకరు తమ బంధాన్ని పూర్తిగా తెంచుకోలేరు అలాగని పెంచుకోరు.
బ్రెడ్ క్రంబింగ్ షిప్:
ఇద్దరిలో ఒక వ్యక్తి ముందుగా ఎక్కువగా ఇష్టం చూపించి మరి కాల్స్, మెసేజ్లు వంటివి చేస్తారు, కానీ వారిలో సీరియస్నెస్ అనేది ఉండదు. తరువాత నెమ్మది గా తక్కువ ఎఫర్ట్స్ పెడతారు. అలాగని పూర్తిగా అవతలి వారిని వదిలేయలేరు.
నానోషిప్:
చాలా తక్కువ కాలం వీరి మధ్య బంధం ఉంటుంది. విడిపోవడానికి క్షణాలలో డెసిషన్ తీసుకుంటారు.
కఫ్ఫింగ్ షిప్:
అప్పుడప్పుడే ఒక తోడు కోసం తాత్కాలిక బంధాన్ని క్రియేట్ చేసుకుని సౌకర్యానికి తగ్గట్టుగా మార్చుకుంటారు.
వీటిని చూస్తే మీరు ఏ రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి