సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక్క హాట్ టాపిక్ అంటే అదే – మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ.  ఇది ఎన్నిసార్లు ముగిసిందని చెప్పుకున్నా, మళ్లీ మళ్లీ కొత్త రూపంలో బయటకు వస్తూనే ఉంది. కొన్నిసార్లు “ఇప్పటికే అన్నీ సర్దుకున్నాయి” అంటారు, మరికొన్నిసార్లు “ఇంకా అంతర్గతంగా టెన్షన్ కొనసాగుతూనే ఉంది” అంటారు. ఇటీవల జరిగిన ఉపాసన సీమంతం ఈ విషయాన్ని మళ్లీ హైలైట్ చేసింది. ఉపాసన త్వరలో ట్విన్స్‌కి జన్మనివ్వబోతోంది. ఈ సంతోషాన్ని పురస్కరించుకొని చిరంజీవి–సురేఖలు ఒక చిన్న, సాంప్రదాయబద్ధమైన సీమంతం వేడుకను హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నయనతార, వెంకటేష్, నాగార్జున వంటి సినీ ప్రముఖులతో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులంతా హాజరయ్యారు. చిరంజీవి కుటుంబం, రామ్ చరణ్ స్నేహితులు, ఉపాసన బంధువులు అందరూ పాల్గొని ఆ వేడుకను మరింత అందంగా మార్చేశారు.


అయితే, అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం — అల్లు ఫ్యామిలీ గైర్హాజరు! ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ కానీ, ఆయన భార్య కానీ, అల్లు అర్జున్ కానీ, స్నేహ రెడ్డి కానీ ఎవరూ కనిపించలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. “అల్లు ఫ్యామిలీని అసలు ఆహ్వానించలేదట” అనే వార్తలు బయటకు రావడంతో మరింత కలకలం చెలరేగింది. మరి నిజంగా పిలవలేదా? పిలిచినా రాలేదా? ఈ రెండు ప్రశ్నల చుట్టూ ఇప్పుడు అంతా చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు, “ఉపాసన సీమంతానికి పిలవకపోవడం అనేది కుటుంబ మధ్య దూరాలు ఇంకా సర్దుకోలేదన్న సంకేతం” అని అంటున్నారు. మరికొందరు మాత్రం, “అల్లు అరవింద్ అమ్మ గారు ఇటీవలే మరణించారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి శుభ కార్యక్రమాలకు హాజరుకావడం కాస్త అపశ్రుతిగా భావిస్తారు. అందుకే రాలేదు” అని వాదిస్తున్నారు.అయితే మరోవైపు, కొంతమంది అభిమానులు మాత్రం “ముందు కూడా ఇలాంటి సమయాల్లో ఇద్దరు కుటుంబాలు కలిసి కనిపించాయి, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు” అని చర్చిస్తున్నారు. ఇదే కారణంగా #MegaVsAllu  అనే హ్యాష్‌ట్యాగ్‌ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరిని అన్‌ఫాలో చేసారు, ఎవరిని ఫోటోలలో ట్యాగ్ చేసారు — అన్నీ ఫ్యాన్స్ పరిశీలనలో ఉన్నాయి.



ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇది పెద్ద అంతర్గత విభేదం కాదు.కొన్ని వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరు కాలేకపోయిందని చెబుతున్నారు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని వేరే కోణంలో చూస్తూ సోషల్ మీడియాలో యుద్ధస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.ఇక వీలైనంత త్వరగా చిరంజీవి గానీ, అల్లు అరవింద్ గానీ లేదా రామ్ చరణ్ – అల్లు అర్జున్‌లో ఎవరో ఒకరు ఈ విషయంపై స్పష్టత ఇస్తే మంచిదని అభిమానులు కోరుతున్నారు. లేకపోతే సోషల్ మీడియా వార్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: