ఓరి నాయనోయ్.. ‘స్పిరిట్’ సినిమాలో రాంగోపాల్ వర్మ ఉన్నాడా..? సందీప్ రెడ్డి వంగ డెసిషన్ పై జనాల్లో రకరకల డౌట్లు మొదలు అయ్యాయి. ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ హైప్ ఉండటమే కాదు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. అయితే ఈ అప్డేట్‌పై రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో కొత్త హంగామా సృష్టిస్తోంది. ఎప్పటిలాగే తన స్టైల్లోనే ఘాటుగా, కాస్త వెరైటీగా రియాక్ట్ అయిన ఆర్జీవీ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఆర్జీవీ తన ట్వీట్‌లో ఇలా రాసుకొస్తూ..“సందీప్... నీ మంచి అలవాట్లు నాకు తెలుసు, అలాగే ప్రభాస్ చెడు అలవాట్లు కూడా నాకు బాగా తెలుసు. మీ ఇద్దరి స్పిరిట్‌కి హృదయపూర్వక అభినందనలు.” అంటూ పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ల్దే హైలెట్ గా మారింది. ఇది  చదివిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు నెటిజన్లు వెంటనే కామెంట్ చేస్తూ —“నువ్వు ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నావా  వర్మా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు..“అంత ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ నీకు ఎలా తెలుసు ?” అంటూ జోకులు వేస్తున్నారు. కొంతమంది మాత్రం వర్మ స్టైల్ కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అవుతూ —“ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కాదా?” ..“సందీప్ రెడ్డి వంగ ఆర్జీవీకి పెద్ద ఫ్యాన్ అని ముందే చెప్పాడు కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు.”అంటున్నారు.



సందీప్ రెడ్డి వంగ తన కెరీర్ ప్రారంభం నుంచే రాంగోపాల్ వర్మను గురువుగా భావిస్తూ వచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి ముందు కూడా వర్మ సినిమాల ప్రభావం తన మీద చాలా ఉందని సందీప్ అనేకసార్లు పబ్లిక్‌గా చెప్పాడు. అందుకే ఇప్పుడు వర్మ చేసిన ఈ కామెంట్ వెనక కూడా ఒక రకమైన సానుభూతి, అభినందన ఉందని కొందరు అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం “ఆర్జీవీ వర్సెస్ నెటిజన్లు” అనే రేంజ్‌లో మీమ్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వర్మ మామూలుగా మాట్లాడినా వార్తే అవుతుంది. ఇప్పుడు ‘స్పిరిట్’ సినిమాపై ఆయన రియాక్షన్ రావడంతో మరోసారి ఆయన పేరు ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయింది.మొత్తానికి —సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ఆర్జీవీ ఈ ముగ్గురి పేర్లు కలిసొచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలవుతుందన్నది మాత్రం అక్షరాలా నిజం..!



మరింత సమాచారం తెలుసుకోండి: