అక్రమ సంబంధం కారణంగా ఎంత మంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయో చెప్పనక్కర్లేదు. అక్రమ సంబంధం మోజులో పడి చాలామంది ఆడవాళ్లు భర్తలను చంపేస్తూ కడుపున పుట్టిన పిల్లల్ని కూడా అత్యంత హీనంగా చంపేస్తున్నారు. ఇక కొంతమంది భర్తలు కూడా ప్రియురాలి కోసం భార్యల్ని పిల్లల్ని చంపుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ సంబంధాలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ తాజాగా బాలీవుడ్ లో ఉండే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఈ అక్రమ సంబంధాలను సపోర్ట్ చేస్తూ అవి కరెక్టే అంటూ మాట్లాడారు  దాంతో ఈ హీరోయిన్ల మాటలపై చాలామంది నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.మరి ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరయ్యా అంటే కాజోల్, ట్వింకిల్ ఖన్నా.. తాజాగా ఈ ఇద్దరు హోస్ట్ గా చేస్తున్న టూ మచ్ విత్ టాక్ షోలో కరణ్ జోహార్,జాన్వీ కపూర్ లు పాల్గొన్న సమయంలో ఫిజికల్ చీటింగ్, ఎమోషనల్ చీటింగ్ ఈ రెండింట్లో ఏది పెద్ద నేరం అని అడిగారు. 

అయితే దీనిలో ఫిజికల్ చీటింగ్ పెద్ద నేరం అని జాన్వీ కపూర్ చెప్పగా.. కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా,కాజోల్ మాత్రం ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ పెద్ద నేరం అని చెప్పారు.దానికి జాన్వీ కపూర్ అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఈ హీరోయిన్లు 20 లో ఇలాగే ఉంటుంది  50 ఏళ్లు వచ్చాక నువ్వు కూడా ఇలాగే అంటావులే అంటూ ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్లు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది జనాలు వీరిపై మండిపడుతున్నారు.

అసలు మీరు ఆడవాళ్లేనా.. ఇంత చీప్ గా ఆలోచిస్తారా.. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు ఫిజికల్ చీటింగ్ నేరం కాదు అని చెప్పి మీ అభిమానులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు.. అంటూ మండి పడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ హీరోయిన్లు మాట్లాడిన మాటలు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: