తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. కెరియర్ ప్రారంభంలో ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో అత్యంత తక్కువ కాలం లోనే ఈయనకు దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఈయన దర్శకత్వం వహించిన ఆఖరి రెండు సినిమాలు మాత్రం ప్రేక్షకులను నిరుత్సాహ పరచాయి. కొంత కాలం క్రితం ఈయన తలపతి విజయ్ హీరో గా లియో అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈయన రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. లోకేష్ కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ హీరో గా ఖైదీ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ చివరన ఈ సినిమాకు కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దానితో చాలా మంది ఖైదీ 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ..? ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ..? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం ఆ సినిమాను పక్కన పెట్టి వేరే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ మరికొన్ని రోజుల్లోనే కార్తీ హీరో గా ఖైదీ 2 ను మొదలు పెట్టబోతున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. లోకేష్ "కూలీ" సినిమా తర్వాత ఆమీర్ ఖాన్ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం లోకేష్ తన తదుపరి మూవీ గా ఖైదీ 2 చేయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: