గత కొంత కాలంగా మన తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమాలు కేవలం మన తెలుగు భాషలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అవుతూ వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లలో చిరంజీవి హీరో గా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా పెద్ద ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.

ఈ సినిమాపై మొదటి నుండి తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లను వసూలు చేసింది. కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో కాస్త విఫలం అయింది. దానితో చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను వేసినా కూడా అది అంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇకపోతే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో మరొకరు అయినటువంటి బాలకృష్ణ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను వేశాడు.

అందులో భాగంగా ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తున్నారు. మరి అఖండ 2 మూవీ తో బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన సక్సెస్ను అందుకొని ఫుల్ క్రేజీ ను సంపాదించుకుంటాడో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. అఖండ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: