గోపీచంద్ బర్తడే సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో గోపీచంద్ ఒక యోధుడిలా కనిపించే పాత్రలో చూపించారు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా ఎప్పుడు విభిన్నమైన కథలతోనే అలరిస్తుంటారు. భారత చరిత్రలోనే ప్రాముఖ్యతమైన అధ్యాయాన్ని ఇప్పుడు వెండితెర పైన గోపీచంద్ తో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కెరియర్ లోనే ఎప్పుడు చేయని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు గోపీచంద్. ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వ్యవహారం మాత్రం ఇంకా బయటికి రాలేదు.
గోపీచంద్ సినీ కెరియర్ విషయానికి వస్తే 2001లో మొదటిసారి తొలి వలపు అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత జయం, నిజం వర్షం వంటి చిత్రాలలో విలన్ గా నటించారు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో మళ్ళీ హీరోగా ప్రయత్నించి రణం, ఆంధ్రుడు లక్ష్యం, శౌర్యం, గోలీమార్ తదితర చిత్రాలలో హీరోగా నటించిన మంచి విజయాలను అందుకున్నారు. చివరిగా భీమా, విశ్వం ఇలాంటి చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నారు. మరి తన 33వ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి