సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజక్ట్ చేసిన మూవీ లో మరొకరు నటించి హిట్టు కొట్టడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన మూవీ లలో కొంత మంది హీరో లు గా నటించి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఓ మూవీ కథను ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు రిజక్ట్ చేయగా మరో నటుడు అదే కథలో హీరో గా నటించి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ నే అందుకున్నాడు. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఆ మూవీ లో హీరో గా నటించిన నటుడు ఎవరు అని అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు పోకిరి. ఆ సినిమాలో హీరో గా నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ మొదట ఈ మూవీ కథను రాసుకున్నాక అందులో రవితేజ ను హీరోగా అనుకున్నాడట. రవితేజ కూడా ఆ కథలో హీరో గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఆ తర్వాత ఆ సినిమా చేయాల్సిన సమయం లో రవితేజ వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో , పూరి జగన్నాథ్ కూడా వేరే సినిమాలను స్టార్ట్ చేశాడట. దానితో ఆ సినిమా కథను పక్కన పెట్టేసారట. ఇక కొంత కాలం తర్వాత ఆ మూవీ కథను పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ కి వినిపించాడట. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమా కథలో హీరో గా నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదట. దానితో పూరి జగన్నాథ్ అదే కథను మహేష్ బాబు కు వినిపించాడట. మహేష్ బాబు కి ఆ స్టోరీ అద్భుతంగా నచ్చడం తో వెంటనే పోకిరి మూవీ స్టోరీ లో హీరో గా నటించగా ... ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించింది. అలా రవితేజ , పవన్ కళ్యాణ్ రిజక్ట్ చేసిన మూవీ లో మహేష్ బాబు హీరో గా నటించి ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: