నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొంత కాలం క్రితం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అఖండ 2 మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై ప్రస్తుతానికి బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బాలయ్య "అఖండ 2" మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని , బాలయ్య సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే బాలయ్య సినిమాలో హీరోయిన్ ని కూడా ఈయన కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య మూవీ లో గోపీచంద్ , నయనతార ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు , ఇప్పటికే గోపీచంద్ మలినేని , నయనతార ను కలిసి ఈ మూవీ కథను వినిపించగా ఆమె కూడా బాలయ్య , గోపీచంద్ కాంబో సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య , నయనతార కాంబోలో సింహ , జై సింహ అనే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దానితో బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబో లో రూపొందబోయే సినిమాలో నయనతార హీరోయిన్గా నటించినట్లయితే ఈ మూవీ కూడా మంచి విజయం సాధిస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: