దక్షిణ భారత సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, ఇప్పుడు నిర్మాతగా మరోసారి కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అనేక మంది అభిమానులను తన నటనతో, తన శక్తివంతమైన మహిళా పాత్రలతో ఆకట్టుకున్న సమంత — ఈసారి వెండితెర వెనక నుండి కొత్త కథకు జీవం పోసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సమంత- రాజ్ నిడమూరు తో కలిసి “మా ఇంటి బంగారం” అనే కొత్త చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల అద్భుతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ పూజా కార్యక్రమానికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు అయ్యారు. సమంత  సాంప్రదాయంగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది. రాజ్ నిడమూరుతో కలిసి క్లాప్ కొట్టడం ద్వారా కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ సభ్యులు కూడా హాజరయ్యారు.


సినిమా టైటిల్ వినగానే ఒక ఇంటి ఆత్మీయత, కుటుంబ బంధం, ప్రేమ, త్యాగం అనే భావాలు గుర్తుకు వస్తాయి. “మా ఇంటి బంగారం” అనేది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కబోతోందని తెలుస్తుంది. ఇది ప్రేమ, మాతృత్వం, సంబంధాల విలువ, మరియు మహిళా గౌరవం చుట్టూ తిరిగే సున్నితమైన కథ అని సమాచారం. సమంతకు ఎప్పటి నుంచో సామాజిక విలువలతో కూడిన కంటెంట్‌ మీద ప్రత్యేక ఆసక్తి ఉంది. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్‌కి నిర్మాతగా ముందుకొచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సమంత “శుభం:” వంటి సినిమాతో ప్రొడ్యూసర్ గా తన ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పుడు “మా ఇంటి బంగారం” ద్వారా కెమెరా వెనక ఉన్న మహిళా శక్తిగా నిలబడబోతోంది. ఇప్పుడు రాజ్ నిడమూరుతో కలసి నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్, ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



రాజ్ నిడమూరు పేరు వినగానే అందరికీ “థీ ఫ్యామిలీ మ్యాన్”,  లాంటి కంటెంట్  ప్రాజెక్టులు గుర్తుకువస్తాయి. ఆయన కథల్లోని నేచురల్ ఎమోషన్స్, హ్యూమర్, రియాలిటీ మేళవింపు వల్లనే ఆయనకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. “మా ఇంటి బంగారం” కోసం ఆయన మరియు సమంత ఇద్దరూ ఒక సున్నితమైన, జీవన సత్యాలతో కూడిన కథను ఎంపిక చేశారని తెలుస్తోంది. కథలో భావోద్వేగం, నవ్వులు, కన్నీళ్లు అన్నీ కలగలసి ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో ప్రేమలో విఫలమై తన కుటుంబానికి కొత్త ఆశగా నిలిచే యువతి పాత్రలో సమంతనే కనిపించవచ్చనే వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ విషయాల్లో కూడా అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటించబోతున్నారని నిర్మాతలు తెలిపారు.



సమంత పోస్ట్ చేస్తూ..“ఈ సినిమా నాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్. నేను ఈ కథ విన్న క్షణం నుంచే ఇందులో ఉన్న భావోద్వేగాన్ని అనుభవించాను. కుటుంబం, ప్రేమ, ఆత్మగౌరవం — ఇవే మన జీవితానికి పునాది. ‘మా ఇంటి బంగారం’ ఆ విలువలను గుర్తుచేసే సినిమా అవుతుంది. ఈ ప్రయాణం ప్రారంభమైనందుకు చాలా ఆనందంగా ఉంది, నాకు మీ ఆశీర్వాదాలు కావాలి” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సమంత  పోస్ట్  వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  #MaaIntiBangaram, #SamanthaRuthPrabhu హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, “ప్రొడ్యూసర్ సమంత రాకెట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: