సినిమా ఇండస్ట్రీ లో ఒకరు వదులుకున్న సినిమాలో మరొకరు నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొంత మంది వదిలేసిన సినిమాలలో మరి కొంత మంది వద్దకు చేరి అవి అద్భుతమైన విజయాలను సాధించడం , అలాగే వారి కెరియర్ కూడా ఆ సినిమాలతో మారిపోయే సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక అలాంటి సంఘటన చిరు చేసిన ఒక మిస్టేక్ వల్ల ఒక హీరోకు జరిగినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ,  రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆఖరి పోరాటం అనే సినిమాలో హీరోbగా నటించాడు. ఈ మూవీ లో శ్రీదేవి హీరోయిన్గా నటించగా ... అశ్వినీ దత్మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ తో నాగార్జున కు మొదటి కమర్షియల్ విజయం దక్కింది. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా నాగర్జున మాట్లాడుతూ ... నేను హీరోగా కెరియర్ను మొదలు పెట్టాక చాలా సినిమాల్లో నటించాను. కానీ నాకు మొదటి కమర్షియల్ విజయం మాత్రం ఆఖరి పోరాటం సినిమా ద్వారానే వచ్చింది అని చెప్పాడు. మొదట ఆఖరి పోరాటం సినిమాని నాగార్జున తో కాకుండా చిరంజీవి తో చేయాలి అని రాఘవేందర్రావు , అశ్వినీ దత్ అనుకున్నారట.

అందులో భాగంగా చిరంజీవి ని  కలిసి విషయం చెప్పగా ఆయన కూడా ఓకే చెప్పాడట. ఇక సినిమా మొదలు పెడదాం అనుకునే సమయానికి చిరంజీవి చాలా సినిమాలతో బిజీగా ఉండడంతో వేరే హీరోతో ఆ సినిమా చేయండి అని రాఘవేందర్రావు , అశ్విని దత్ లకి చెప్పాడట. దానితో నాగార్జునకు ఆ కథను వివరించగా ఆయన ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా చిరు రిజక్ట్ చేసిన మూవీలో నాగార్జున హీరోగా నటించి మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: