
విఖ్యాత దర్శకుడు మణిరత్నం పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వస్తుంది అక్కినేని నాగార్జన నటించిన 'గీతాంజలి'... అంతే కాదు ఆయన దర్శకత్వంలో విరబూసిన .. '

తెలుగులో ఆమె నటించిన 'అంకురం' సినిమాకు ఫిలింఫేర్ అవార్డు ను అందుకున్నారు. రాంగోపాల్ వర్మ 'గాయం' చిత్రంలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. బహుబాషా నటి అయిన అమె ప్రభాస్ తోలి చిత్రం 'ఈశ్వర్' లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర పోషించారు. ఆ తరువాత చాలా కాలం తెలుగు సినిమాకు దూరమయ్యారు. వివిధ భాషల్లో తల్లిగా, అత్తగారిగా పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా 'ఇట్లు అమ్మ' తేలుగు చిత్రంలో నటించారు.
నటి రేవతి దర్శకురాలు కూడా. శోభన ప్రధాన పాత్రలో ఈమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మిత్ర్, మై ఫ్రెండ్’ . ఇది ఆంగ్ల చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ ఇంగ్లిష్ కేటగిరీలో జాతీయ అవార్డు లభించింది.