వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల వారు వీరలెవెల్లో ప్రచారాలు చేశారు... కానీ వరంగల్ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కి పట్టం కట్టారు..  టీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు స్థాయిలో గెలుపొందారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తుల్లో ఏడవ స్థానంలో నిలిచారు. ఈయన గెలుపుతో టీఆర్ఎస్ నేతల్లో మరింత బలం పుంజుకుంది. ఇక పసునూరి దయాకర్ కేవలం లోకల్ నాయకులే కాదు ఖండాంతరాలు దాటి నివసిస్తున్న ప్రవాస టిఆర్ఎస్ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ లండన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులు ఒక్క దగ్గర చేరి శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ కీలక పాత్ర వహించారు..అందుకే ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని కేసీఆర్ జిందాబాద్  అంటూ లండన్ వీధుల్లో నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ గెలుపు కాదని యావత్ తెలంగాణ ప్రజల గెలుపని తెలంగాణ కోసం ఆరవై సంవత్సరాలు కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి సంపాదించారని అందుకోసం మనం మన తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. ముఖ్యంగా వరంగల్ ప్రజలకు కృతజ్ఞాభివందనాలు తెలిపారు.

ఈ సంబరాల్లో ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి నవీన్ రెడ్డి, కార్యదర్శి దొంతుల వెంకట్ రెడ్డి , యూకే, యురోప్ ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ కడుడుల, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, వెల్‌ఫేర్ ఇంఛార్జ్ వినయ్ కుమార్, మెంబర్‌షిప్ ఇంఛార్జ్ సతీష్ రెడ్డి బండ, ముఖ్య నాయకులు సృజన్ రెడ్డి చాడా, సత్యం రెడ్డి కంది, సత్య హాజరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: