ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నో రకాల విషయాలు ప్రతి రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. మారుమూల ప్రాంతాల్లో జరిగిన విషయాలు కూడా క్షణాల వ్యవధిలో ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో వింతైన విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే కొంతమందికి ఉన్న వింతైన వ్యాధులకు సంబంధించిన విషయాలు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడూ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. వామ్మో ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అని ఈ వార్త చదివిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అరుదైన వ్యాధితో బాధపడుతూ ఒక వ్యక్తిని చూసి ప్రతి తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా ఒక మనిషి శరీరంలో వెంట్రుకలు అనేవి కూడా ఒక భాగం అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం ఆ వెంట్రుకలే ఏకంగా ఒక పెద్ద సమస్యగా మారిపోయాయి. అదేంటి వెంట్రుకల కారణంగా సమస్య రావడం ఏంటి అనుకుంటున్నారు కదా.. అందరిలా ఇతనికి కూడా వెంట్రుకలు ఉంటే పర్వాలేదు. కానీ  కాస్త విచిత్రంగా వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి. ముక్కు, చెవులు పెదాలు, కళ్ళు ఇలా అన్ని శరీర భాగాలపై వెంట్రుకలు మొలిచాయి.


 దీంతో సదరు వ్యక్తి అందరిలాగా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ కు చెందిన లలిత్ పాటిదార్ ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. హైపర్ ట్రిచోసిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. ఆరేళ్ల వయస్సు ఉన్ననాటి నుంచి శరీరం అంతట వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలలో తనను చూసి అందరూ భయపడుతున్నారని లలిత్ చెప్పుకొచ్చాడు. అయితే వెంట్రుకలు ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటాను అంటూ తెలిపాడు. కాగా మధ్యయుగం నుంచి కేవలం 50 మందికి మాత్రమే ఇలాంటి వ్యాధి వచ్చిందని దీనికి చికిత్స కూడా లేదని వైద్యులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: