ఏపీలో అధికారం వైసీపీలో ఉన్న క‌మ్మ‌ నేతలకు ముందు నుంచి కష్టాలు తప్పడం లేదు. ఒకప్పుడు సమైక్య రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన క‌మ్మ నేతలు ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కేవలం ఆరుగురు క‌మ్మ ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని కి మాత్రమే జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. కృష్ణా జిల్లా నుంచి మైల‌వ‌రంలో వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి, గుంటూరు జిల్లా నుంచి మరో ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేలు గెలిచారు.

వీరిలో కొడాలి నాని మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే. తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్ - పెదకూరపాడు లో నంబూరి శంకరరావు - వినుకొండ లో బొల్లా బ్రహ్మనాయుడు - దెందులూరులో కొఠారు అబ్బ‌య్య చౌద‌రి, మైల‌వ‌రంలో కృష్ణ ప్ర‌సాద్‌ తొలిసారిగా ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే రెండున్నర సంవత్సరాల పాలన పూర్తయ్యాక చూస్తే వీరు అందరూ ఇప్పుడు తమ తమ నియోజకవర్గాల్లో ఏటికి ఎదురీదు తున్నారు.

వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. ఇటీవల తమ సొంత మండలం శావ‌ల్యాపురం లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోలేక పోయారు. దెందులూరు లో అబ్బాయి చౌదరి అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మూడు చోట్ల వైసీపీ కి పెద్ద షాక్ తగిలింది.

కొండపల్లి మున్సిపాలిటీ ని కోల్పోవడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ క‌ష్టాల్లో పడ్డారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై గెలిచిన ఏడాది నుంచే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఒక్క పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మినహా మిగిలిన క‌మ్మ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కష్టాల్లో పడినట్టే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: