ఏపీ రాజకీయాల్లో జనసేన సైతం దూకుడుగా రాజకీయం చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే జనసేన...వైసీపీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంది. అయితే పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో పోరాటం చేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే..పోరాటాలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు కూడా అదేవిధంగా ముందుకెళుతున్నారు. ఇలా చేస్తే పార్టీకి ఏ మాత్రం బెనిఫిట్ ఉండదు..అందుకనే జనసేన నేతలు కూడా దూకుడుగా ఉండాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

అలాగే తమకు పట్టున్న నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత నాదెండ్ల మనోహర్..బ్యాగ్రౌండ్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో 175 నియోజకవర్గాల్లో జనసేనకు పెద్దగా బలం లేదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి బలం ఉంది. ఇక ఆ స్థానాలపైనే ఫుల్‌గా ఫోకస్ పెట్టి జనసేన నేతలు పనిచేస్తున్నారట.

ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా ఈ రెండు చోట్ల జనసేన జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల జనసేనకు బాగా ఓట్లు పడ్డాయి. రెండు చోట్ల జనసేన సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. భీమవరంలో ఎలాగో పవన్ పోటీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి కూడా పవన్..అక్కడే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఈ సారి గెలుపు కాస్త సులువయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు నరసాపురంలో కూడా జనసేన సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఈ సీటుని కూడా నెక్స్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని జనసేన శ్రేణులు చూస్తున్నాయి. ఒకవేళ టీడీపీతో గానీ పొత్తు ఉంటే...ఈ రెండు సీట్లలో జనసేన పోటీ చేసి ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే నరసాపురం-భీమవరం స్థానాల్లో జనసేనకు మంచి అవకాశం ఉందనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: