ఎంత వత్తిడి లో ఉన్నా ఎలా నెగ్గాలో జగన్ నుంచి అందరు నేర్చుకోవాల్సిన విషయం. ఓ ఎనిమిది సంవత్సరాల ముందు జగన్ పరిస్థితి ఎలా ఉన్నది అనేది అందరికి తెలిసిందే.. ఓ వైపు తండ్రి మరణం, మరి వైపు కేసులు, ఇంకో వైపు అప్పుడే పుట్టిన పార్టీ భాధ్యతలు ఇవన్ని జగన్ కి ఒకేసారి ముంచుకు రావడంతో అయన ఎలా తట్టుకుని నిలబడతారో అని అందరు అనుకున్నారు.. కానీ జగన్ వాటిని అధిగమించి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఎదిగారు.. తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలకు నిరూపిస్తే చాలు అని ప్రజల్లోకి వెళ్లి మరీ తనని తాను కాపాడుతున్నాడు..